ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.122.68 కోట్లు

ABN, First Publish Date - 2023-02-02T02:59:18+05:30

తిరుమల శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. గతేడాది మార్చి నుంచి హుండీ ఆదాయం వరుసగా ప్రతి నెలా రూ.వంద కోట్లు దాటుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2న రికార్డుస్థాయిలో రూ.7.68 కోట్ల రాబడి

తిరుమల, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. గతేడాది మార్చి నుంచి హుండీ ఆదాయం వరుసగా ప్రతి నెలా రూ.వంద కోట్లు దాటుతోంది. కాగా, జనవరిలో 31వ తేదీ వరకు 20,58,242 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.122.68 కోట్లు లభించింది. మరోవైపు జనవరి 2వ తేదీన రూ.7.68 కోట్ల హుండీ ఆదాయం రావడం గమనార్హం.28వ తేదీ రథసప్తమి రోజున అత్యధికంగా 80,094 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మార్చిలో రూ.128.64 కోట్లు, ఏప్రిల్‌లో రూ.127.65 కోట్లు, మేలో రూ.130.29 కోట్లు, జూన్‌లో రూ.123.74 కోట్లు, జూలైలో రూ.139.33 కోట్లు, ఆగస్టులో రూ.140.34 కోట్లు (ఇదే అధికం), సెప్టెంబరులో రూ.122.19 కోట్లు, అక్టోబరులో రూ.122.83 కోట్లు, నవంబరులో రూ.127.31 కోట్లు, డిసెంబరులో రూ.129.37 కోట్లు లభించింది. కాగా, శుక్రవారం టీటీడీ డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులు ఈవో ధర్మారెడ్డితో నేరుగా మాట్లాడవచ్చు. దీనికోసం 0877 2263261 నంబరులో సంప్రదించాలి.

Updated Date - 2023-02-02T02:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising