షార్‌లో సౌండింగ్ రాకెట్ ప్రయోగం
ABN, First Publish Date - 2023-10-11T01:03:10+05:30
శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌లో మంగళవారం రోహిణి సౌండింగ్ రాకెట్ (ఆర్‌హెచ్-200)ను ప్రయోగించారు.
సూళ్లూరుపేట, అక్టోబరు 10: శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌లో మంగళవారం రోహిణి సౌండింగ్ రాకెట్ (ఆర్‌హెచ్-200)ను ప్రయోగించారు. అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా షార్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఉదయం 11 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. రాకెట్ నింగిలోకి ఎగిరిన వెంటనే చప్పట్లు కొడుతూ విద్యార్థులు ఆనందంగా వీక్షించారు. 3.5 మీటర్ల పొడవున్న ఈ రాకెట్ ప్రయోగించిన తరువాత 70 కిలోమీటర్ల ఎత్తులోకి దూసుకెళ్లింది. రెండు దశలున్న ఈ రాకెట్ సాలిడ్ మోటార్ల ద్వారా శక్తిని పొంది నింగిలోకి ఎగిరింది. వాతావరణ అధ్యయనాల కోసం ఇస్రో ఈ రాకెట్‌ను ఉపయోగిస్తోంది. అంతరిక్ష వారోత్సవాల ముగింపు రోజు క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో పాటు ముందుగా అనుమతి పొందిన విద్యార్థులను షార్‌కు పిలిపించి సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
-
Updated Date - 2023-10-11T01:03:10+05:30 IST