ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొరబాట్లు లేకుండా చూడండి : కలెక్టర్
ABN, First Publish Date - 2023-02-15T01:33:22+05:30
పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల విధులు కేటాయించిన నోడల్ అధికారులు, సిబ్బంది ఎక్కడా చిన్న పొరబాటు జరగకుండా చూడాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు.
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 14 : పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల విధులు కేటాయించిన నోడల్ అధికారులు, సిబ్బంది ఎక్కడా చిన్న పొరబాటు జరగకుండా చూడాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో ఆయన నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు అవసరమైన మేర బ్యాలెట్ పెట్టెలు సిద్ధం చేసుకోవాలన్నారు. మెటీరియల్ ట్రాన్స్‌పోర్ట్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, బ్యాలెట్ పత్రాల ముద్రణ, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, రిపోర్టింగ్ సెల్, రోజువారీ నివేదికలు, ఎంసీఎంసీ వెబ్ కాస్టింగ్‌కు సంబంధించి నియమించిన అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్, డీఆర్వో రాజశేఖర్, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి, డీపీవో లక్ష్మి, డీటీసీ బసిరెడ్డి, హౌసింగ్ పీడీ పద్మనాభం, డీఈవో విజయేంద్రరావు, డ్వామా పీడీ గంగాభవానీ, సీపీవో ఉమాదేవి, ఎల్డీఎం శేషగిరిరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిద్దాం..
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ కోరారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేసీ వెంకటేశ్వర్, డీఆర్వో రాజశేఖర్‌లతో కలిసి ఆయన సమావేశమయ్యారు.
Updated Date - 2023-02-15T01:33:26+05:30 IST