ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి ఎస్సీవీ గుడ్‌బై?

ABN, First Publish Date - 2023-05-26T02:13:10+05:30

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎస్సీవీ నాయుడు అధికార పార్టీని వీడనున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబును బుధవారం కలిసిన ఎస్సీవీ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశముంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రబాబును కలసిన మాజీ ఎమ్మెల్యే

తిరుపతి, మే 25 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎస్సీవీ నాయుడు అధికార పార్టీని వీడనున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబును బుధవారం కలిసిన ఎస్సీవీ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశముంది. విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రబాబుతో ఎస్సీవీ నాయుడు బుధవారం మంగళగిరిలో భేటీ అయ్యారు. తనకు సముచిత స్థానం కల్పిస్తే పార్టీలో చేరి క్రియాశీలంగా పనిచేస్తానని ప్రతిపాదించినట్టు సమాచారం. తొలుత పార్టీలో చేరి కష్టపడి పనిచేయాలని, దానికనుగుణంగా ప్రాధాన్యత కల్పిస్తానని చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్న ఎస్సీవీ నాయుడు నెలలోపు టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది.తొలుత టీడీపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎస్సీవీ నాయుడు పార్టీని వీడాక 2004లో కాంగ్రెస్‌ తరపున శ్రీకాళహస్తి నుంచీ పోటీ చేసి గెలుపొందారు.2014 ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలో చేరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయానికి కృషి చేశారు.2019 ఎన్నికల్లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే నాలుగేళ్ళుగా అధికార పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతో అసంతృప్తికి గురైన ఆయన పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్టు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-05-26T02:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising