ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రచందనం స్మగ్లింగులో కొత్తబాట

ABN, First Publish Date - 2023-06-07T02:08:04+05:30

ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త తరహా రవాణాకు తెరలేపారు. అడవిలోనే దుంగలను నరికి, ఆపై సైజులవారీ రీపర్లుగా తయారు చేసి తరలిస్తున్నారు

ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న డీఎస్పీ యశ్వంత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడవిలోనే సైజులవారీ రీపర్లుగా దుంగలు

రూ.కోటి విలువైన చెక్కలు,వాహనాల స్వాఽధీనం

చెన్నై బడా స్మగ్లర్‌ సహా ఐదుగురి అరెస్ట్‌

చంద్రగిరి, జూన్‌ 6 : ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త తరహా రవాణాకు తెరలేపారు. అడవిలోనే దుంగలను నరికి, ఆపై సైజులవారీ రీపర్లుగా తయారు చేసి తరలిస్తున్నారు.ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లె సమీపంలోని సాయికాడ గుట్ట దగ్గరున్న ఆంజనేయస్వామిగుడి వద్ద పోలీసులు జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.మంగళవారం చంద్రగిరిలో డీఎస్పీ యశ్వంత్‌ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.భాకరాపేట సీఐ తులసీరామ్‌ బృందం సాయికాడ గుట్ట వద్ద కొన్ని వాహనాలను, వ్యక్తులను గుర్తించి చుట్టుముట్టారు.ఐదుగురు స్మగ్లర్లతో పాటు రెండు కార్లను, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు.లారీలో 72 ఎర్రచందనం కొయ్య చెక్కలతో పాటు నాలుగు చెక్క ముక్కల మూటలు, రంపపు పొట్టు నింపిన 9 మూటలను గుర్తించారు. స్వాఽధీనం చేసుకున్న వాహనాలు, ఎర్రచందనం విలువ కోటి రూపాయలు ంటుందని డీఎస్పీ తెలిపారు.స్మగ్లర్లను విచారించగా చెన్నైకి చెందిన మహ్మద్‌ రజుల్‌, కార్తీక్‌, దిండిగల్‌కు చెందిన మారియ భాస్కరన్‌ జేసురాజ్‌, అన్నమయ్య జిల్లా సిద్దారెడ్డిపల్లెకు చెందిన తిరుమలశెట్టి నాగరాజ, గడికోటకు చెందిన అమరేంద్రగా తేలిందన్నారు. వీరిలో మహ్మద్‌ రజుల్‌పై 25కు పైగా కేసులున్నాయని, పీడీ యాక్ట్‌ కేసులో శిక్ష కూడా అనుభవించినట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు ఎర్రావారిపాలెం మండల సరిహద్దులో స్మగ్లర్లకు సహకరిస్తున్న ఇద్దరు స్థానికులను గుర్తించినట్లు డీఎస్పీ వెల్లడించారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ తులసీరామ్‌,ఎ్‌సఐలు వెంకటేశ్వర్లు, ప్రకా్‌షకుమార్‌, ఏఎ్‌సఐ కోదండరామిశెట్టి, హెడ్‌ కానిస్టేబుళ్లు గోవిందయ్య, గోపి, కానిస్టేబుళ్లు వీరేంద్ర, లక్ష్మీనారాయణ, సుబ్రమణ్యం, సునీల్‌కుమార్‌, దేవేంద్రనాయక్‌, ప్రసాద్‌, హోంగార్డులు రాజేష్‌, వెంకటకిషోర్‌, బాలసుబ్రమణ్యం, శ్రీకాంత్‌, విజయ, చంద్రశేఖర్‌లకు రివార్డులను ఎస్పీ ప్రకటించారు.

Updated Date - 2023-06-07T02:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising