కల్పవృక్ష వాహనంలో రాజమన్నార్ రాజసం
ABN, First Publish Date - 2023-09-22T01:03:20+05:30
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన గురువారం ఉదయం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల, ఆంధ్రజ్యోతి: తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన గురువారం ఉదయం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి జరిగిన సర్వభూపాల వాహన సేవలో వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవిలతో కలిసి శ్రీవారు దర్శనమిచ్చారు. తొలిరోజు నుంచి జరిగిన వాహన సేవలకు గ్యాలరీల్లో భక్తుల రద్దీ మోస్తరుగానే కనిపించింది. అయితే శుక్రవారం గరుడవాహనం, పెరటాశి మొదటి శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో గురువారం సాయంత్రం నుంచే రద్దీ పెరిగింది. ఈ క్రమంలో సర్వభూపాల వాహన సేవకు నాలుగు మాడవీధులూ భక్తులతో నిండుగా కనిపించాయి. అలాగే వాహన సేవల్లో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చెన్నై నుంచి వచ్చిన గొడుగుల ఊరేగింపు, శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకొచ్చిన గోదాదేవి మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Updated Date - 2023-09-22T01:03:20+05:30 IST