ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారి ఆలయ ఉద్యోగిపై పోలీసుల విచారణ వేగవంతం

ABN, First Publish Date - 2023-01-30T01:30:02+05:30

పద్మావతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్జిత ఇన్‌స్పెక్టర్‌ దామోదర్‌ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ శేషాద్రిపై దాడి చేసిన విషయంలో తిరుచానూరు పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుచానూరు, జనవరి 29: పద్మావతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్జిత ఇన్‌స్పెక్టర్‌ దామోదర్‌ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ శేషాద్రిపై దాడి చేసిన విషయంలో తిరుచానూరు పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా పోలీసులు ఆదివారం అమ్మవారి ఆలయానికి చేరుకుని సంఘటన జరిగిన సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, అధికారుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. దాడి ఘటనలో సాక్షులను కూడా విచారించారు. ఘటనకు సంబంధించిన కీలక సాక్ష్యాలు, సీసీపుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన పరికరాన్ని స్వాధీనం చేయాలని ఆలయ అధికారులను కోరారు. దామోదర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. భక్తులు వచ్చే ప్రాంతంలో ఓర్పుతో విధులు నిర్వహించాలని, పోలీసుపై దాడి చేయడాన్ని టీటీడీ కూడా సీరియ్‌సగా తీసుకుంది. దామోదర్‌పై చర్యలు తీసుకునేందుకు టీటీడీ ఉన్నతాధికారులు విచారణ చేయిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారి ఆలయానికి చేరుకుని ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న సుబేదారు, ఆలయ ఉద్యోగుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. సోమవారం ఉన్నతాధికారులకు ఇవ్వనున్నారు. ఒకటి రెండు రోజుల్లో దామోదర్‌పై టీటీడీ అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Updated Date - 2023-01-30T01:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising