ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశం

ABN, First Publish Date - 2023-05-26T02:08:26+05:30

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మే 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. డౌన్‌ ఘాట్‌ రోడ్డులోనూ కాంక్రీట్‌తో రీటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని చైర్మన్‌ గురువారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇందుకు దారి తీసిన కారణాలపై అధికారులతో చర్చించారు. చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ బస్సులో సాంకేతిక ఇబ్బందులేమీ లేవని ఓలెక్ర్టా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు సమాచారమిచ్చారన్నారు. అతివేగం లేదా డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణమై ఉండచ్చని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విద్యుత్‌ బస్సుల డ్రైవర్లకు మరోసారి శిక్షణ ఇప్పించాలని సూచించారు. టీటీడీ సీవీఎస్వో నరసింహకిశోర్‌, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, ఓలెక్ర్టా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T02:08:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising