సదుంలో దారుణం
ABN, First Publish Date - 2023-02-27T01:22:38+05:30
‘ఏమన్నా, బాగున్నావా’ అం టూ కుశలం అడిగిన పాపానికి ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఆదివారం సదుంలో జరిగింది.
సదుం, ఫిబ్రవరి 26: ‘ఏమన్నా, బాగున్నావా’ అం టూ కుశలం అడిగిన పాపానికి ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఆదివారం సదుంలో జరిగింది.పోలీసుల కథనం మేరకు... సదుం మండలం ఊటుపల్లె పంచాయతీ బొమ్మిరెడ్డిగారిపల్లెకు చెందిన శేషాద్రి ఆదివారం తన పొలంలో జేసీబీతో చదును పనులు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన చల్లావారిపల్లెకు చెందిన లక్ష్మయ్య కుమారుడు రవి(40) శేషాద్రిని ‘ఏమన్నా బాగున్నావా’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శేషాద్రి రవిపై ఆగ్రహించి తనను కుశల ప్రశ్నలు అడిగేటంతటి వాడివా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అతడి తలపై రాయితో గట్టిగా కొట్టాడు. దీంతో రవి అక్కడిక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న రవి కుటుంబసభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అతని మృతదేహం వద్ద బోరున విలపించారు.
Updated Date - 2023-02-27T01:22:39+05:30 IST