నేత్రానందం.. మహా రథోత్సవం
ABN, First Publish Date - 2023-09-26T01:55:38+05:30
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం మహా రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం మహా రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తుల గోవిందనామస్మరణతో మాడవీధులు దద్దరిల్లాయి. రథాన్ని తాళ్లతో లాగిన భక్తుల భక్తిశ్రద్ధల ముందు.. భారీ పరిమాణం, బరువు కలిగిన మహారథం చకచకా ముందుకు కదిలింది. రథంలో కొలువుదీరిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని దర్శించుకుని భక్తకోటి పులకించింది. ఉదయం 6.55 గంటలకు మొదలైన రథోత్సవం ఎక్కడా ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు సాగింది. రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన అశ్వవాహనంపై మలయప్పస్వామి.. కల్కి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.
- తిరుమల, ఆంధ్రజ్యోతి
Updated Date - 2023-09-26T01:55:38+05:30 IST