ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నవనీత చోరా... నమో నమః

ABN, First Publish Date - 2023-10-22T02:38:30+05:30

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా సాగింది. చల్లటి వాతావరణంలో పుష్పాలంకరణలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, కళాకారుల ప్రదర్శనలు, గోవిందనామ స్మరణలు, కర్పూర కాంతుల నడుమ చంద్రప్రభ వాహనంపై నవనీతకృష్ణుడి అలంకారంలో కొలువుదీరిన మలయప్పస్వామి మాడవీధుల్లో దర్శనమిచ్చారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా సాగింది. చల్లటి వాతావరణంలో పుష్పాలంకరణలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, కళాకారుల ప్రదర్శనలు, గోవిందనామ స్మరణలు, కర్పూర కాంతుల నడుమ చంద్రప్రభ వాహనంపై నవనీతకృష్ణుడి అలంకారంలో కొలువుదీరిన మలయప్పస్వామి మాడవీధుల్లో దర్శనమిచ్చారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వెంకటరమణ, జస్టిస్‌ కృపాసాగర్‌ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండ్లతో హారతి పట్టి ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా వాహన సేవలో పాల్గొన్నారు. కాగా, ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పించారు. శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌ స్వామి, టీటీడీ ఛైర్మన్‌ కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-10-22T02:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising