ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వెంకన్న ఆలయానికి మరింత భద్రత

ABN, First Publish Date - 2023-08-22T01:35:19+05:30

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో భద్రతను మరింత పటిష్ఠం చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ వివిధ చర్యలు చేపడుతోంది. హఠాత్తుగా శత్రువులు ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే అడ్డుకునేలా ఆక్టోపస్‌ సిబ్బందితో క్యూఆర్టీ (క్విక్‌ రియాక్షన్‌ టీం) స్టేషన్‌ ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది.

శ్రీవారి ఆలయం ముందు ఆక్టోపస్‌ సిబ్బంది (ఫైల్‌ ఫొటో)

- శత్రువు వస్తే వెంటనే స్పందించేలా ప్రణాళిక

- ఆక్టోపస్‌ క్యూఆర్టీ స్టేషన్‌ ఏర్పాటు దిశగా అడుగులు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో భద్రతను మరింత పటిష్ఠం చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ వివిధ చర్యలు చేపడుతోంది. హఠాత్తుగా శత్రువులు ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే అడ్డుకునేలా ఆక్టోపస్‌ సిబ్బందితో క్యూఆర్టీ (క్విక్‌ రియాక్షన్‌ టీం) స్టేషన్‌ ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది.

ఇప్పటికే 40 మంది ఆక్టోపస్‌ సిబ్బంది

తిరుమలకు సంఘ విద్రోహుల నుంచి ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఏదైనా ప్రదేశంపై దాడులు జరిగితే తిప్పికొట్టేందుకు టీటీడీ కొన్నేళ్ల కిందట ఆక్టోపస్‌ సిబ్బందికి బేస్‌ కేటాయించింది. ఇందులో భాగంగా నిత్యం 40 మంది ఆక్టోపస్‌ సిబ్బంది తిరుమలలోనే ఉంటారు. నెలలో రెండు, మూడుసార్లు మాక్‌డ్రిల్‌ కూడా నిర్వహిస్తుంటారు. ఏదైనా ప్రాంతంలో అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకునేలా వీరి బృందం సిద్ధంగా ఉంటుంది. నెలకోసారి ఈ బృందం మొత్తం మారుతుంటుంది.

బయోమెట్రిక్‌ వద్దే ‘స్టేషన్‌’

శ్రీవారి ఆలయంలోకి ఎవరైనా శత్రువులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తే అడ్డుకునేందుకు ఓ ప్రత్యేక బృందం సిద్ధంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. ఇందుకోసం ఆలయంలోకి ఉద్యోగులు ప్రవేశించే బయోమెట్రిక్‌ వద్ద ప్రత్యేకంగా క్యూఆర్టీ స్టేషన్‌ ఏర్పాటు చేసి.. అందులో ఆరుగురు ఆక్టోపస్‌ సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఎవరైనా హఠాత్తుగా ఆయుధాలతో ఆలయంలోకి ప్రవేశించి అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తే క్యూఆర్టీ బృందం వెంటనే అలర్ట్‌ అవుతుంది. ఆయుధాలతో ఎదురుదాడికి దిగడంతోపాటు బేస్‌లో ఉండే ఆక్టోపస్‌ సిబ్బందికి సమాచారం అందజేస్తుంది. దీనిపై ఇప్పటికే ఆక్టోపస్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈస్టేషన్‌లోని సిబ్బందిని ప్రతి రెండు గంటలకు మార్చేలా చర్యలు తీసుకోనున్నారు. సెప్టెంబరు మొదటివారంలోగా ఈ స్టేషన్‌ను ప్రారంభించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-08-22T01:35:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising