ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2023-02-03T00:31:35+05:30

ఐరాల పోలీసు స్టేషన్‌ పరిధిలోని గుండ్లపల్లి ఎస్టీకాలనీ బస్టాపు వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను గురువారం ఐరాల పోలీసులు అరెస్టు చేశారు.

గంజాయితో పట్టుబడిన మహిళా నిందితులను అరెస్టు చూపుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు మహిళల అరెస్టు

ఐరాల, ఫిబ్రవరి 2: ఐరాల పోలీసు స్టేషన్‌ పరిధిలోని గుండ్లపల్లి ఎస్టీకాలనీ బస్టాపు వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను గురువారం ఐరాల పోలీసులు అరెస్టు చేశారు. కల్లూరు సీఐ ఆశీర్వాదం కథనం మేరకు.. ఐరాల మండలం గుండ్లపల్లి ఎస్టీకాలనీకి చెందిన సిద్ధమ్మ అలియాస్‌ కుట్టెమ్మ, ఎం.సునీత రెండు చేతిసంచులలో గంజాయి పెట్టుకుని ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఐరాల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో బస్టాప్‌ వద్దకు వెళ్లగా సదరు మహిళలు పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని వారి నుంచి రూ.15 వేలు విలువచేసే ఒకటిన్నర కేజీ (1.50 కేజీ) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఏఎ్‌సఐ లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-03T00:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising