ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్‌ రహిత జిల్లాకు కృషి చేద్దాం : డీఆర్వో

ABN, First Publish Date - 2023-01-18T00:25:52+05:30

మాదక ద్రవ్యాల (డ్రగ్స్‌) రహిత జిల్లాగా చిత్తూరును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఆర్వో రాజశేఖర్‌ అధికారులను ఆదేశించారు.

అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 17: మాదక ద్రవ్యాల (డ్రగ్స్‌) రహిత జిల్లాగా చిత్తూరును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఆర్వో రాజశేఖర్‌ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలకు సంబంధించి బ్యానర్లు ముఖ్యమైన కూడళ్లు, కళాశాలల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం డీఆర్వో ఛాంబర్‌లో స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ యువత డ్రగ్స్‌ బారిన పడకుండా కళాశాలల యాజమాన్యాలు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన బ్యానర్లు, హోర్డింగులను ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారమున్నా 14500కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్‌ విక్రయాలు, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఈఎస్‌ ఆయిషా, జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆనందరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ మీరా సాహెబ్‌, చిత్తూరు డీఎల్డీవో రవికుమార్‌, డీవైఈవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising