15న ‘లక్ష మెజారిటీ’ ప్రచారం ప్రారంభం
ABN, First Publish Date - 2023-06-13T01:37:49+05:30
కుప్పంలో టీడీపీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా 14, 15, 16 తేదీల్లో చంద్రబాబు పర్యటన ఉంటుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు.
కుప్పం, జూన్ 12: కుప్పంలో టీడీపీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా 14, 15, 16 తేదీల్లో చంద్రబాబు పర్యటన ఉంటుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో 15వ తేది నిర్వహించనున్న బహిరంగ సభలో ‘లక్ష మెజారిటీ క్యాంపైన్’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి, వారితో సమావేశాలకు పర్యటనను పరిమితం చేసుకున్నారని చెప్పారు. టీడీపీకి కుప్పంలో లక్ష మెజారిటీ తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు పర్యటనలో భారీ చేరికలుంటాయని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ కుప్పం మున్సిపల్, మండల అధ్యక్షులు రాజ్‌కుమార్, ప్రేమ్‌కుమార్, నాయకులు ప్రతాప్, సత్యేంద్రశేఖర్, మణి, సోము తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-13T01:37:49+05:30 IST