తిరుమలలో పెరిగిన రద్దీ
ABN, First Publish Date - 2023-09-22T01:17:48+05:30
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు వినాయకచవితి కావడం, సీఎం పర్యటన ఉండటంతో సోమ, మంగళవారాల్లో రద్దీ తక్కువగా కనిపించింది.
మాడవీధుల్లో భక్తుల రద్దీ
తిరుమల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు వినాయకచవితి కావడం, సీఎం పర్యటన ఉండటంతో సోమ, మంగళవారాల్లో రద్దీ తక్కువగా కనిపించింది. బుధవారం మోస్తరుగా కనిపించింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. పైగా పెరటాసి మాసం మొదటి శనివారం వస్తున్న క్రమంలో రద్దీ పెరిగింది.
Updated Date - 2023-09-22T01:17:48+05:30 IST