ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాస్త్రోక్తంగా గురుసంక్రమణ పూజలు

ABN, First Publish Date - 2023-04-24T00:05:45+05:30

శ్రీకాళహస్తీశ్వరాల యంలోని దక్షిణామూర్తి సన్నిధిలో ఆదివారం గురు సంక్రమణ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 23: శ్రీకాళహస్తీశ్వరాల యంలోని దక్షిణామూర్తి సన్నిధిలో ఆదివారం గురు సంక్రమణ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. నవ గ్రహాల్లో పంచమగ్రహం అయిన గురువు ద్వాదశ రాశుల్లో ఒక దాని నుంచి మరోరాశికి మారే సమయాన్నే గురు సంక్రమణంగా ఆరాధిస్తారు. నవ గ్రహాల్లోనే అత్యంత శుభగ్రహంగా భక్తులు పూజించే గురు గ్రహానికి అధిపతిగా దక్షిణామూర్తిని పూజి స్తారు. దేవతల గురువైన గురుదక్షిణామూర్తి స్వామి ముక్కంటి ఆలయంలో దక్షిణాభిముఖంగా కొలువె ఉన్నారు. ఏటా గురువురాశి మారే క్రమంలో విశేషంగా గురు సంక్రమణ పూజలు నిర్వహిస్తుం టారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి గురువు మీన రాశి నుంచి మేషం రాశకి మారడంతో ఆల యంలోని గురుదక్షిణామూర్తికి అష్టోత్తర శత శంఖాభిషేకం నిర్వహించారు. ముందుగా ఆల యాన్ని మంత్ర జలాలతో శుద్ధిచేశారు. అనంతరం శాస్త్రోక్తంగా కలశస్థాపన జరిగింది. తరువాత దక్షిణా మూర్తికి గోక్షీరం, శుద్ధజలం, పెరుగు, చందనం, నెయ్యి, తేనె, పంచదార, నారికేళజలం, పచ్చ కర్పూ రం, పసుసు, కుంకుమ వంటి వివిధ ద్రవ్యాలతో అభిషేకించారు. కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం దక్షిణామూర్తి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛ రణలు, మేళతాళాలు, కేరళ వాయిద్యాల మద్య ధూప దీప, నైవేద్యాలు, హారతులు సమర్పించారు. విశేష ఉత్సవాన్ని భక్తులు కన్నుల పండుగగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పాలకమండలి చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్‌బాబు అనువంశక ప్రధాన అర్బకులు డాక్టర్‌ స్వామినాథన్‌ గురుకుల్‌, ప్రధాన అర్చకులు కురుణాకర్‌ గురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా తేరువీధిలోని పుష్పగిరి మఠంలో ఆదివారం గురుసంక్రమణ పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-24T00:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising