ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుడుపల్లె ఎంపీడీవో సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2023-06-26T23:53:18+05:30

గుడుపల్లె ఎంపీడీవో రమణను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ షన్మోహన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా అక్కడి వైసీపీ నాయకులు, ప్రజల నుంచి ఎంపీడీవోపై ఫిర్యాదులు అందినట్లు, ఆ కారణంగానే ఎంపీడీవోను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఎంపీడీవో రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): గుడుపల్లె ఎంపీడీవో రమణను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ షన్మోహన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా అక్కడి వైసీపీ నాయకులు, ప్రజల నుంచి ఎంపీడీవోపై ఫిర్యాదులు అందినట్లు, ఆ కారణంగానే ఎంపీడీవోను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వెనుకంజలో ఉన్నారని, ప్రజలు.. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం లేదనే కారణాలు సస్పెండ్‌ ఆర్డర్స్‌లో ప్రస్తావించారు. రెగ్యులర్‌ ఏవోగా ఉన్న ఈయన, నెల రోజులు ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. అంతకుముందు బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల్లోనూ ఈయన పనిచేశారు. ప్రాథమిక విచారణ తర్వాత సస్పెండ్‌ చేసి, ఇప్పుడు డీటైల్డ్‌ విచారణ కోసం పలమనేరు డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ ఉమావాణిని నియమించారు. ప్రస్తుతం అక్కడి ఈవోపీఆర్డీ శంకర్‌కు ఇన్‌ఛార్జి ఎంపీడీవో బాధ్యతలను అప్పగించారు.

Updated Date - 2023-06-26T23:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising