హౌస్‌హోల్డ్ సర్వే మ్యాపింగ్ సవరణకు గ్రీన్ సిగ్నల్
ABN, First Publish Date - 2023-01-18T00:31:39+05:30
గతంలో నిర్వహించిన హౌస్‌హోల్డ్ సర్వేలో జరిగిన తప్పులను సరిచేసుకునేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 17: గతంలో నిర్వహించిన హౌస్‌హోల్డ్ సర్వేలో జరిగిన తప్పులను సరిచేసుకునేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి 50 - 75 కుటుంబాలను క్లస్టర్‌గా విభజించి కుటుంబాలు, కుటుంబ సభ్యుల వివరాలను హౌస్‌హోల్డ్ సర్వే పేరిట మ్యాపింగ్ చేశారు. 2019 నుంచి 2021 వరకు కొనసాగిన ఈ సర్వే సవరణలను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పెన్షన్లు, రేషన్‌కార్డుదారులపై వేటుపడింది. ఆరంచెల పరిశీలన (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్)లో భాగంగా పిల్లలు ఆదాయ పన్ను కడుతున్నట్లు, కార్డుదారులకు నాలుగు చక్రాల వాహనాలు, అధిక భూమి ఉందన్న కారణాలు చూపి ఇటీవల పెన్షన్లు, బియ్యం కార్డులను తొలగించారు. దీనిపై విమర్శలు రావడంతో ప్రస్తుతం హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో సవరణలకు ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. ఈ విషయమై డీఎస్వో శంకరన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన విషయం వాస్తవమేనని, త్వరలో ప్రారంభిస్తామని అన్నారు.
Updated Date - 2023-01-18T00:31:54+05:30 IST