సైకో సీఎంకి బుద్ధి వచ్చేలా పట్టభద్రులు నిర్ణయం తీసుకోవాలి : టీడీపీ
ABN, First Publish Date - 2023-03-12T00:58:56+05:30
సైకో సీఎం జగన్ బుద్ధి వచ్చేలా పట్టభద్రులు నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు.
చిత్తూరు సిటీ, మార్చి 11: సైకో సీఎం జగన్ బుద్ధి వచ్చేలా పట్టభద్రులు నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పట్టభద్రులకు సంబంధించి టీడీపీ మద్దతు ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇపుడు జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకుపోతున్న సీఎంకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
Updated Date - 2023-03-12T00:58:56+05:30 IST