కాణిపాకంలో వైభవంగా గోపూజ
ABN, First Publish Date - 2023-01-18T00:24:07+05:30
కాణిపాకంలో మంగళవారం గోపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈవో వెంకటేశు సిబ్బందితో కలసి పూజాద్రవ్యాలను గోశాలకు తీసుకొచ్చారు.
గోవులకు పచ్చిక తినిపిస్తున్న ఈవో వెంకటేశు
ఐరాల(కాణిపాకం), జనవరి 17: కాణిపాకంలో మంగళవారం గోపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈవో వెంకటేశు సిబ్బందితో కలసి పూజాద్రవ్యాలను గోశాలకు తీసుకొచ్చారు. గోవులను సిబ్బంది శుభ్రం చేసి, సుందరంగా అలంకరించారు. గోమాత చిత్రపటాన్ని ఉంచి, పూజలు నిర్వహించారు. ఆలయ మాడవీధులలో గోవులను ఊరేగించారు. అనంతరం వాటికి పచ్చిక, దాణా పెట్టారు. ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్‌రావు, ధనంజయయాదవ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-01-18T00:24:11+05:30 IST