ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా సంకటహర గణపతి వ్రతం

ABN, First Publish Date - 2023-01-11T00:10:53+05:30

కాణిపాకంలో మంగళవారం సంకటహర గణపతి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. అలంకార మండపం వద్దనున్న కల్యాణ వేదికపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిని కొలువుదీర్చి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు.

అలంకార మండపం వద్ద వ్రతాన్ని నిర్వహిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల (కాణిపాకం), జనవరి 10: కాణిపాకంలో మంగళవారం సంకటహర గణపతి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. అలంకార మండపం వద్దనున్న కల్యాణ వేదికపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిని కొలువుదీర్చి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల ఆధ్వర్యంలో అర్చక పండితులు సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహింపజేశారు. ఈ వ్రతాన్ని ఆలయంలో పౌర్ణమి గడిచిన నాలుగు రోజులకు నిర్వహించడం ఆనవాయితీ. ఈ వ్రతాన్ని నిర్వహిస్తే సర్వకష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుని ఉత్సవ విగ్రహాలను అలంకార మండపం నుంచి తీసుకొచ్చి స్వర్ణరథంపై ఆశీనులను చేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శాంతి సాగర్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీనివాస్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీ నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-11T00:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising