ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మండలాలు, మున్సిపాలిటీలకు అదనంగా గృహాల మంజూరు

ABN, First Publish Date - 2023-10-09T23:53:07+05:30

మండలాలకు 300, మున్సిపాలిటీలకు 500 చొప్పున అదనంగా జగనన్న ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు.

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 9: మండలాలకు 300, మున్సిపాలిటీలకు 500 చొప్పున అదనంగా జగనన్న ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. వీటి నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణ చేయాలని తహసిల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లను ఆయన ఆదేశించారు. సోమవారం సాయంత్రం వివిధ అంశాలపై కలెక్టరేట్‌ నుంచి జేసీ శ్రీనివాసులతో కలిసి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నియోజక వర్గ పరిధిలో స్థానిక, ప్రయివేటు కంపెనీల ద్యారా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అక్కడ 100- 150 మధ్య నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఈ నెల 16న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఐటీఐ, డిగ్రీ కళాశాలలను గుర్తించాలన్నారు. ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలను తనీఖీ చేసి సమస్యలుంటే యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజశేఖర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-09T23:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising