కాలువలో నీటి ప్రవాహం
ABN, First Publish Date - 2023-05-02T01:04:15+05:30
కార్వేటినగరంలో సోమవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం పడింది. ఈ వర్షానికి డైట్ పక్కన కాలువకు జలకళ వచ్చింది.
కార్వేటినగరం, మే 1: కార్వేటినగరంలో సోమవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం పడింది. ఈ వర్షానికి డైట్ పక్కన కాలువకు జలకళ వచ్చింది. ఎండిపోయిన కాలువలో ఒక్కసారిగా వర్షపు నీరు ప్రవహించడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా, మామిడి తోటలలో కోతకు సిద్ధంగా ఉన్న మామిడి రకాలు కాయలు పెరగటానికి ఈ వర్షం ఉపకరిస్తుందని రైతులు అంటున్నారు.
పాలసముద్రం: పాలసముద్రం మండలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మిట్టప్రాంతాల్లో వున్న మామిడి తోటలకు ఈ వర్షం మంచి చేస్తుందని రైతులు అంటున్నారు.
Updated Date - 2023-05-02T01:04:15+05:30 IST