గుడిమల్లం ఆలయంలో దర్శన సమయం పెంపు
ABN, First Publish Date - 2023-07-15T00:20:05+05:30
ఏర్పేడు మండలం గుడిమల్లంలో కొలువైన పరశురామేశ్వర స్వామి ఆలయ దర్శన సమయాన్ని పెంపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏర్పేడు, జూలై 14: ఏర్పేడు మండలం గుడిమల్లంలో కొలువైన పరశురామేశ్వర స్వామి ఆలయ దర్శన సమయాన్ని పెంపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ఆలయంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే దర్శనం ఉండేది. శనివారం నుంచి 3 గంటలు అదనంగా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన సమయం పెంచినట్లు కేంద్ర పురావస్తుశాఖ డీజీ నుంచి ఆదేశాలు అందాయని ఆలయ చైర్మన్ నరసింహ యాదవ్, ఈవో రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దర్శన సమయాన్ని పెంచడానికి పురావస్తు శాఖ అధికారులతో మాట్లాడి సహకరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి, తిరుపతి ఎంపీ గురుమూర్తికి గ్రామస్తులు, పంచాయతీ సర్పంచ్ సుబ్రహ్మణ్యంయాదవ్, భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Updated Date - 2023-07-15T00:20:05+05:30 IST