ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

ABN, First Publish Date - 2023-05-17T01:07:27+05:30

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మే 16: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ నేపథ్యంలో జరపనున్న వేడుకలకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాటించాల్సిన నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ప్లాస్టిక్‌ వాడకంతో కలిగే నష్టాలను తెలియజేయాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఎస్పీ రిషాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉండేలా ప్రజల జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి చైతన్యకుమార్‌ రెడ్డి కోరారు. పర్యావరణ పరిరక్షణకు తనవంతు సహకారం అందిస్తానంటూ సమావేశంలో పాల్గొన్న అధికారులందరిచే కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ నరేంద్రబాబు, ఏఈ మదన్‌మోహన్‌రెడ్డి, డీపీవో లక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ అరుణ, నెడ్‌క్యాప్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ మునికృష్ణారెడ్డి, ట్రాన్స్‌కో ఈఈ శ్రీహరి, డీఈవో విజయేంద్ర రావుతో పాటు ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-17T01:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising