సమర్థంగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు : జేసీ
ABN, First Publish Date - 2023-03-05T01:08:00+05:30
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సమర్థవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు.
చిత్తూరు (సెంట్రల్), మార్చి 4: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సమర్థవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. శనివారం స్థానిక జెడ్పీ సమావేశ మంది రంలో ఈ నెల 16న జరిగే తూర్పు రాయలసీమ ఉపాధ్యా య, పట్టభద్రుల శాససమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన కౌంటింగ్ సిబ్బందికి డీఆర్వో రాజశేఖర్ పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. జేసీ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అర్థం చేసుకోవాలన్నారు. మాస్టర్ ట్రైనర్, విశ్రాంత ఏజేసీ చంద్రమౌళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు పక్రియపై అవగాహన కల్పించారు. సమావేశంలో తిరుపతి డీఆర్వో శ్రీనివాసరావు, చిత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు, మదనపల్లె, సూళ్లూరు పేట, శ్రీకాళహస్తి, గూడూరు ఆర్డీవోలు, ఎన్‌ఎ్‌సఎ్‌స స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోదండరామిరెడ్డి, కౌంటింగ్ పర్సన్స్, అధికారులు పాల్గొన్నారు.
తహసీల్దార్లకు పోలింగ్ మెటీరియల్ పంపిణీ
శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్‌ను జెడ్పీ కార్యాలయంలో జేసీ వెంకటేశ్వర్, డీఆర్వో రాజశేఖర్, మెటీరియల్ నోడల్ అధికారి, జెడ్పీ సీఈవో ప్రభాకర్ ఆయా జిల్లాల ఆర్డీవోలు, తహసీల్దార్లకు అందజేశారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఏవో కులశేఖర్, చిత్తూరు ఆర్డీవో రేణుక పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T01:08:00+05:30 IST