వీర్నమలలో జన సందడి
ABN, First Publish Date - 2023-01-18T00:13:01+05:30
కోలాహలంగా జల్లికట్టు
రామకుప్పం మండలం వీర్నమలలో మంగళవారం జల్లికట్టును కోలాహలంగా నిర్వహించారు. దీనిని చూసేందుకు వచ్చిన జనంతో గ్రామం జనసంద్రంగా మారింది. కుప్పం ప్రాంతం నుంచే కాకుండా తమిళనాడు సరిహద్దు గ్రామాల నుంచీ వందకుపైగా పశవులను రైతులు తీసుకొచ్చారు. ఉదయం 10గంటలకు ఉమ్మడి వీర్నమల పంచాయతీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి రైతులు తమ పశువులను ఊరేగింపుగా తీసుకువచ్చి గంగమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి పశువులను తీసుకువచ్చిన రైతలు వాటిని భారీ జనసందోహం మధ్య పరుగులు తీయించారు. వీటిని నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఒకరిద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జల్లికట్టు జరిగింది. ఈ జల్టికట్టులో మెరుపు వేగంతో పరుగుల తీసిన పశువులను తమిళనాడుకు చెందిన రైతులు ఒక్కోదానిని రూ.1.5లక్షల నుంచి రూ.3లక్షల వరకు కొనుగోలు చేసినట్టు తెలిసింది.
- రామకుప్పం

Updated Date - 2023-01-18T00:32:47+05:30 IST