కాణిపాకంలో భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2023-07-17T00:21:51+05:30
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు.
స్వామి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
ఐరాల(కాణిపాకం), జూలై 16: స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు. దీంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండి పోయాయి. స్వామి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తుల మధ్య తొక్కిసలాటలు జరగకుండా అధికారులు పర్యవేక్షించారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.
Updated Date - 2023-07-17T00:21:51+05:30 IST