ముగిసిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN, First Publish Date - 2023-06-11T01:34:06+05:30
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఈనెల 2న పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 8వ తేదీకి ప్రధాన పరీక్షలు ముగియగా, శుక్ర, శనివారాల్లో ఆప్షనల్ సబ్జెక్టులకు జరిగాయి.
- 13, 14 తేదీల్లో మూల్యాంకనం
చిత్తూరు (సెంట్రల్), జూన్ 10: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఈనెల 2న పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 8వ తేదీకి ప్రధాన పరీక్షలు ముగియగా, శుక్ర, శనివారాల్లో ఆప్షనల్ సబ్జెక్టులకు జరిగాయి. ఈ రెండింటిలో అందరూ పాస్ కావడంతో జిల్లాలో ఈపరీక్షలు జరగలేదు. షెడ్యూల్ ప్రకారం శనివారానికి పరీక్షలు ముగిశాయి. మొత్తంగా జిల్లాలో 6,685 మంది విద్యార్థులు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఈనెల 13, 14 తేదీల్లో స్థానిక పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం జరగనుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ, పరీక్షల విభాగం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2023-06-11T01:34:06+05:30 IST