విచారణకు రండి
ABN, First Publish Date - 2023-04-03T01:21:14+05:30
దేవదాయ శాఖ పరిధిలోని రూ.వంద కోట్ల హథీరాంజీ మఠం భూమి మాయంపై విచారణలో పురోగతి లేకపోవడంతో నేరుగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ స్పందించారు. విజయవాడ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకావాలని జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లా (మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్) రిజిస్ట్రార్ ఉషారాణి, తిరుపతి జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1 జి.శివకుమారిలను ఆదేశించినట్టు తెలిసింది.
తిరుపతి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ పరిధిలోని రూ.వంద కోట్ల హథీరాంజీ మఠం భూమి మాయంపై విచారణలో పురోగతి లేకపోవడంతో నేరుగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ స్పందించారు. విజయవాడ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకావాలని జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లా (మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్) రిజిస్ట్రార్ ఉషారాణి, తిరుపతి జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1 జి.శివకుమారిలను ఆదేశించినట్టు తెలిసింది. ఈమేరకు సోమవారం విజయవాడలో ఆశాఖ జాయింట్ ఐజీ రవికుమార్ నేతృత్వంలో జరిగే విచారణకు హాజరుకానున్నారు. నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా మఠం భూములను రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గత నెల 23న ఎంవీ అండ్ ఆడిట్ రిజిస్ట్రార్ ఉషారాణిని విచారణాధికారిగా నియమించిన విషయం తెలిసిందే. మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆమె సెలవుపై వెళ్లిపోయారు. దాంతో విచారణ ముందుకు సాగకపోవడంతో రాష్ట్ర కార్యాలయమే రంగంలోకి దిగింది. ఇప్పటికే జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ శివకుమారిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే డీఆర్‌పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఈక్రమంలో ఉన్నతాధికారుల సమక్షంలో జరుగుతున్న విచారణకు ప్రాధాన్యం సంతరించుకోనుంది.
Updated Date - 2023-04-03T01:21:14+05:30 IST