కలెక్టరు సారూ.. కుప్పం ఎమ్మెల్యే పేరెక్కడ?
ABN, First Publish Date - 2023-09-22T01:10:51+05:30
చిత్తూరులో ప్రారంభించిన బీసీ భవన్ శిలాఫలకంలో మాజీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు పేరును అధికారులు మరిచారు.
చిత్తూరు, సెప్టెంబరు 21: చిత్తూరులో ప్రారంభించిన బీసీ భవన్ శిలాఫలకంలో మాజీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు పేరును అధికారులు మరిచారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ భవన్‌కు స్థలాన్ని కేటాయించి రూ.4కోట్ల వరకు అప్పట్లోనే నిధులను కేటాయించారు. దాదాపు 90 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ.. నాలుగున్నరేళ్లుగా ఈ భవనాన్ని పట్టంచుకోలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీసీ భవన్‌కు తుదిమెరుగులుదిద్ది ప్రారంభించారు. ఈ శిలాఫలకంలో బీసీ నేతలు, కార్పొరేషన్ల చైర్మన్ల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు లేకపోవడంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర ఎమ్మెల్యేల పేర్లను చెక్కి రెండోసారి శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిలాఫలకంలో జిల్లాకు సంబంధించి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రొటోకాల్ ప్రకారం చంద్రబాబు పేరు శిలాఫలకంలో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2023-09-22T01:10:51+05:30 IST