ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కుప్పం వైసీపీలో ముదిరిన వర్గపోరు!

ABN, First Publish Date - 2023-09-04T01:58:06+05:30

కుప్పం మండలం వానగట్టపల్లె పంచాయతీలో ఆదివారం జల్లికట్టు నిర్వహణకు అధికార పార్టీలోని ఓ వర్గం నిర్ణయించింది. ఎంపీటీసీ మంగమ్మ కొడుకు బసవరాజు, అదే పార్టీకి చెందిన నాయకులు లక్ష్మీకాంతయ్య, మోహన్‌, శివ తదితరులు ఈ వర్గంలో ఉండి దీనికి విస్తృత ప్రచారం కల్పించారు.

వానగుట్టపల్లె గ్రామం సమీపంలో రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న ఎంపీటీసీ వర్గం

వానగుట్టపల్లె సచివాలయానికి అధికార పార్టీ ఎంపీటీసీ తాళాలు

తమ పార్టీకే చెందిన సర్పంచికి వ్యతిరేకంగా ధర్నా, రాస్తారోకో

కుప్పం, సెప్టెంబరు 3: కుప్పం మండలం వానగట్టపల్లె పంచాయతీలో ఆదివారం జల్లికట్టు నిర్వహణకు అధికార పార్టీలోని ఓ వర్గం నిర్ణయించింది. ఎంపీటీసీ మంగమ్మ కొడుకు బసవరాజు, అదే పార్టీకి చెందిన నాయకులు లక్ష్మీకాంతయ్య, మోహన్‌, శివ తదితరులు ఈ వర్గంలో ఉండి దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. ప్రచార కరపత్రంలో సర్పంచి పార్వతమ్మ కుమారుడు రామచంద్ర, పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్‌ కృష్ణప్ప తదితరుల పేర్లనూ ముద్రించారు. ఇక్కడ ఏ విషయంలో తేడా వచ్చిందో కానీ, సర్పంచి పార్వతమ్మ వర్గం జల్లికట్టును వ్యతిరేకించింది. తమను కనీసం సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని, జల్లికట్టువల్ల శాంతిభద్రతలు క్షీణిస్తాయని పేర్కొంటూ వెంటనే జల్లికట్టును ఆపాల్సిందిగా కుప్పం అర్బన్‌ పోలీసులకు మూడునాలుగు రోజుల క్రితం రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసింది. తర్వాత ఎమ్మెల్సీ భరత్‌ జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడంతో జల్లికట్టు నిర్వహణకు మార్గం సుగమమమైంది. మళ్లీ ఏం జరిగిందో కానీ, జల్లికట్టును నిర్వహించరాదంటూ పోలీసులు నిర్వాహకులకు శనివారం తాఖీదులు పంపారు. దీని వెనుక సర్పంచి వర్గముందని కినుక వహించిన ఎంపీటీసీ వర్గానికి చెందిన వైసీపీ పంచాయతీ ప్రెసిడెంట్‌, సచివాలయ కన్వీనర్‌ కూడా అయిన కృష్ణప్ప, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అదేరోజు మీడియా ముఖంగా ప్రకటించారు. అయినా సరే, ఆదివారం జల్లికట్టు జరగకుండా సర్పంచి వర్గం అడ్డుకోగలిగింది.

మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం..

జల్లికట్టుకు అడ్డుపడడంతో ఎంపీటీసీ వర్గం దాన్ని తీవ్రమైన అవమానంగా భావించింది. సర్పంచి జల్లప్పకొటాలుకు చెందిన వ్యక్తి, ఎంపీటీసీ పంచాయతీ కేంద్రమైన వానగుట్టపల్లెకు చెందిన వారు. విభేదాలు మరింత ముదిరాయి. తమ గ్రామంలో జల్లికట్టు నిర్వహించుకుంటామంటే పొరుగూరువాళ్లయిన సర్పంచి వర్గం అడ్డుపడడాన్ని సహించలేని ఎంపీటీసీ వర్గానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు మహిళలు సహా ఆదివారం వానగుట్టపల్లెలో కుప్పం-తిరుపత్తూరు రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. పంచాయతీ సచివాలయానికి, రైతు భరోసా కేంద్రానికి అధికార పార్టీ ఎంపీటీసీ మంగమ్మ తాళాలు వేసి, మహిళలతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించారు. ఏళ్లతరబడి వైసీపీలో కొనసాగుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన తమను కాదని, సర్పంచి వర్గం మాట విని జల్లికట్టును అడ్డుకోవడం దారుణమని ఎంపీటీసీ మంగమ్మ, ఆమె కుమారుడు బసవరాజు, నాయకులు లక్ష్మీకాంతయ్య, మహన్‌ తదితరులు ధ్వజమెత్తారు. పార్టీ అధిష్ఠానం తమకు కనీస విలువ, గౌరవం ఇవ్వడంలేదని ఇటువంటి పార్టీ తమకు అక్కరలేదని స్పష్టం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అధిష్ఠానాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

తెరవెనుక బడా నాయకులు..

వానగుట్టపల్లె పంచాయతీకి మాత్రమే ఈ వర్గపోరు పరిమితమైనట్లు పైకి కనిపిస్తున్నా, దీని వెనుక అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ, మండల స్థాయి బడా నాయకులు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. వానగుట్టపల్లె సర్పంచి పార్వతమ్మ వర్గం ఎమ్మెల్సీ భరత్‌, కుప్పం మండల కన్వీనర్‌ హెచ్‌ఎం.మురుగేశ్‌ సొంత సామాజిక వర్గానికి చెందినవారు. అందువల్లే వేరే సామాజిక వర్గమైన తమను పార్టీలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీటీసీ వర్గం ఆరోపిస్తోంది. మండలంలోనే కాక, నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ జల్లికట్టు పోటీలు ఎద్దుల పండగ పేరుతో జరుగుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తమ విషయంలోనే జల్లికట్టును పట్టుబట్టి రద్దు చేయడం వెనుక అధినాయకుల ఉద్దేశాలను వేలెత్తి చూపుతోంది. సొంత సామాజిక వర్గానికి కొమ్ముకాసి, ఇతర సామాజిక వర్గాలను అణగదొక్కాలన్న దురుద్దేశం ఇందులో దాగున్నదని ఎంపీటీసీ వర్గం ఆరోపిస్తోంది.

Updated Date - 2023-09-04T01:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising