ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేడుకగా పద్మావతీ పరిణయం

ABN, First Publish Date - 2023-04-30T02:41:15+05:30

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో శనివారం పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో శనివారం పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మలయప్పస్వామి గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయ నాంచారులు పల్లకీపై నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి సాయంత్రం వేంచేశారు. స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగింది. తర్వాత స్వామికి కొలువు నిర్వహించారు.వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత శ్రీదేవి, భూదేవి సహితుడైన స్వామి బంగారు తిరుచ్చిపై ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వేడుక ముగిసింది.పరిణయోత్సవాల్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవి చీమలపాటి, జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆదివారం ఉదయం వీరు శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా పరిణయ మండపాన్ని వివిధ రకాల ఫల, పుష్పాలతో అలంకరించడంతో పాటు చిన్నికృష్ణుడు, వెన్నకుండలు, ఏనుగులు, నెమళ్లు సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Updated Date - 2023-04-30T02:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising