ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుదేలైన క్యాబేజీ రైతు

ABN, First Publish Date - 2023-02-07T00:04:06+05:30

పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి మండలాల్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

పలమనేరు మార్కెట్‌ యార్డుకు వచ్చిన క్యాబేజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు, ఫిబ్రవరి 6: నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి మండలాల్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ సాధారణ కూరగాయల సాగుకంటే పెట్టుబడి వ్యయం ఎక్కువ. ఈ రెండు పంటలకు సంప్రదాయ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు కూడా వినియోగించాల్సి వుంది. అయితే వేలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన పంటకు నేడు కూలీల ఖర్చులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా క్యాబేజీ 35 కిలోల బస్తా కేవలం రూ.100 ధర పలకడం గగనంగా మారింది. ఇక 15 - 20 క్యాలీఫ్లవర్ల ధర కూడా రూ.100 మించడం లేదు. చెన్నై మార్కెట్‌లో ధరలు లేకపోవడం కారణమని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు. అంతేకాక రెండేళ్లుగా వర్షాలు కురుస్తుండడంతో విస్తారంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ సాగు చేశారు. దీంతో ఒక్కసారిగా దిగుబడులు పెద్ద ఎత్తున రావడంతో మార్కెట్‌లో ధరలు పతన మయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. టమోటా ధరలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలకు ప్రభుత్వం అప్పుడప్పుడు చర్యలు తీసుకొనేదని, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ రైతుల గోడు మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు.

ఆదుకున్న గుమ్మడి

సంప్రదాయ పంటలకు భిన్నంగా బైరెడ్డిపల్లెకు చెందిన రైతు వెంకటేసు గుమ్మడి సాగు చేపట్టాడు. పంట దిగుబడి ఆశా జనకంగా ఉన్నా ఇక్కడ కొనుగోలు చేసేవారు లేక ఒడిసాకు తరలించారు. పలమనేరు నియో జకవర్గంలోని బైరెడ్డిపల్లె మండలానికి చెందిన వెంకటేసు తనకున్న రెండెకరాల పొలంలో గుమ్మడి సాగు చేశాడు. కర్ణాటక రాష్ట్రం కోలారు నుంచి భీష్మా రకానికి చెందిన గుమ్మడి గిం జలను తెప్పించుకొని తన పొలంలో విత్తాడు. విత్తిన మూడు నెలలకే కాయలు దిగుబడికి వచ్చాయి. స్థానిక మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంకటేసు ఆందోళన చెందాడు. అయితే ఓ వ్యాపారి వెంకటేసు వద్దకు వచ్చి టన్ను గుమ్మడి కాయలు రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి ఒడిసాకు తరలించాడు. గుమ్మడి సాగు చేసేందుకు దాదాపు రూ.40 వేల మేర ఖర్చు కాగా విక్రయించగా రూ.70 వేల మేరకు లభించింది. కేరళలో జరిగే ఓనం పండుగకు అక్కడి ప్రజలు విశేషంగా గుమ్మడి వినియో గిస్తారు. దీంతో పలమనేరు నియోజకవర్గంలో పలువురు రైతులు ఓనం పండుగకు ముందు గుమ్మడి సాగుచేసి గిట్టుబాటు ధరలు పొందేవారు. ఆశించినంత ఆదాయం రాకపోయినా నష్టపోలేదని రైతు వెంకటేసు పేర్కొన్నారు.

Updated Date - 2023-02-07T00:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising