గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌నాయుడు మృతి
ABN, First Publish Date - 2023-01-29T00:51:51+05:30
మండలంలోని కలిజవేడు పంచాయతీ కె.నాశంపల్లె గ్రామానికి చెందిన గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత తలపనేని భాస్కర్‌నాయుడు(58) శుక్రవారం మరణించారు.
భాస్కర్‌నాయుడు(ఫైల్‌ఫోటో)
గంగాధరనెల్లూరు, జనవరి 28: మండలంలోని కలిజవేడు పంచాయతీ కె.నాశంపల్లె గ్రామానికి చెందిన గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత తలపనేని భాస్కర్‌నాయుడు(58) శుక్రవారం మరణించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడు తూ కన్నుమూశారు. ఆయన మృతి విషయం తెలుసుకుని శనివారం పలువురు నాయకులు కె.నాశంపల్లెకు చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. మండలంలోని సుందరరాజుపురం వద్ద గల హెరిటేజ్ డెయిరీ అభివృద్ధికి ఆయన తనవంతు సహకారం అందించారు.
Updated Date - 2023-01-29T00:51:54+05:30 IST