ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు

ABN, First Publish Date - 2023-08-02T01:58:14+05:30

విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు హెచ్చరించారు.

తనిఖీ చేస్తున్న జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 1: విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జిల్లాపరిషత్‌ కార్యాలయంలోని వివిధ విభాగాలను తనిఖీ చేశారు. విధుల్లో సక్రమంగా పనిచేయని కొంతమంది సిబ్బందిని పిలిచి మందలించారు. సెలవులో వెళ్లే ఉద్యోగులు ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. కోర్టు కేసులు, ఇతర ముఖ్యమైన ఫైళ్లను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలన్నారు. ఇకపై ఉద్యోగులు తమ పనితీరు మార్చుకోవాలని, జడ్పీ ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో ప్రవర్తిస్తే తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రోజువారి కేటాయించిన విధులు, సాధించిన ప్రగతి, క్లియర్‌ చేసిన ఫైళ్ల వివరాలను ప్రతిరోజు సిబ్బంది నుంచి సేకరించి సీఈవోకు అందజేయాలని ఆయా విభాగాల సూపరింటెండెంట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T01:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising