ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

205 బడులపై విలీనం కత్తి

ABN, First Publish Date - 2023-02-21T02:21:02+05:30

మరోసారి బడులపై ప్రభుత్వం ‘విలీనం’ కత్తి పెట్టింది. ఈ సారి 205 పాఠశాలలకు ఎసరు తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌): మరోసారి బడులపై ప్రభుత్వం ‘విలీనం’ కత్తి పెట్టింది. ఈ సారి 205 పాఠశాలలకు ఎసరు తెచ్చింది. గతేడాది 498 పాఠశాలలను విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇలా.. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాట్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుండటంతో డీఎస్సీ మాట మరచిపోయేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలతో పాఠశాలల విలీనంతో విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 2020-21 విద్యా సంవత్సరం నుంచి మొదలైన బడుల విలీన ప్రక్రియ ఏటా కొనసాగించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2020-21 విద్యా సంవత్సరంలో తొలి విడతగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 316 ప్రాథమిక పాఠశాలలను 250 మీటర్లు దూరంలోని 312 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. మలి దశలో 2021-22 విద్యా సంవత్సరానికి తొలుత మూడు కిలో మీటర్ల దూరంలోని పాఠశాలలను విలీనం చేయాలని భావించినా, చివరకు కిలో మీటరు దూరంలోని పాఠశాలలను విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లా విభజన తర్వాత చిత్తూరు జిల్లాలో 2099 ప్రాథమిక, 315 ప్రాథమికోన్నత, 524 ఉన్నత పాఠశాలలు చొప్పున 2938 ఉన్నాయి. వీటిలో 2.47 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కిలో మీటరు దూరంలోని పాఠశాలల విలీనం ఉత్తర్వులతో 498 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 347 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ విలీనంతో సుమారు వెయ్యికి పైగా టీచర్లు పోస్టులు ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ ఏడాదీ విలీనం పరంపర

బడుల విలీనం పరంపర 2022-23 విద్యా సంవత్సరంలోనూ కొనసాగనుంది. పాఠశాలల విలీన ప్రక్రియలో ఈ ఏడాది ప్రభుత్వం మరో సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకురానుంది. కేవలం 10 మంది, అంత కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని భావించింది. ఈ క్రమంలో జిల్లాలోని 205 పాఠశాలలు తెరమరుగు కానున్నాయి. జిల్లా విద్యాశాఖ తాజా లెక్కల ప్రకారం జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ యాజమాన్యాలకు సంబంధించి 1915 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 90 శాతానికిపైగా ఈ కేటగిరిలోని బడులు రద్దు కానున్నాయి. కేవలం 10 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్యను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఏకోపాధ్యాయ పాఠశాలపైనా అధికారులు దృష్టి సారించారు.

బదిలీలకు ముందే సర్దుబాట్లు!

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రమంలో అంతకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విలీన పాఠశాలలపై ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ కేవలం విద్యార్థుల పరీక్షల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మౌనందాల్చింది. పరీక్షలు ముగియగానే వేసవి సెలవుల్లో విలీన ప్రక్రియ పూర్తి చేసి, ఆపై బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.

పాఠశాలల విలీనం తగదు

విలీనం పేరిట ప్రభుత్వ పాఠశాలలను ఏటా తగ్గించడం తగదు. ఈ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఇప్పటికే పలుమార్లు విలీనం చేసిన ప్రభుత్వం తాజగా 10 మంది విద్యార్థుల్లోపు ఉన్న పాఠశాలలను రద్దు చేయడంలో భాగంగా విలీన ప్రక్రియను తెరపైకి తీసుకురావడం దారుణం. దీన్ని ఏపీటీఎఫ్‌ తీవ్రంగా ఖండిస్తోంది.

- కిరణ్‌కుమార్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పిల్లలకు విద్యను దూరం చేస్తారా?

ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు పాఠశాలల విలీనం పేరిట విద్యను దూరం చేయడం తగదు. దీని ద్వారా డ్రాప్‌ అవుట్స్‌ పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుంది.

- నరోత్తమరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, స్కూల్‌ అసిస్టెంట్‌ సంఘం

Updated Date - 2023-02-21T02:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising