ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అడవిలో ప్రసవ వేదన!

ABN, First Publish Date - 2023-08-02T04:06:22+05:30

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నల్లగొండ శివారు బోయవూట గిరిజన గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులను డోలీల్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రసవించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

రహదారి లేక డోలీల్లో గర్భిణుల తరలింపు

మార్గమధ్యంలో ప్రసవం.. తల్లులు, బిడ్డలు క్షేమం

కొయ్యూరు, ఆగస్టు 1: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నల్లగొండ శివారు బోయవూట గిరిజన గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులను డోలీల్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రసవించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్‌, ఆశ కార్యకర్త వారి వెంట ఉండడంతో ప్రసవానంతరం శిశువులతో సహా వారిని క్షేమంగా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గ్రామానికి చెందిన వంతల సుశీల, పాంగి చిన్నారికి నెలలు నిండాయి. ఈ నెల 6న ప్రసవమవుతుందని వైద్య సిబ్బంది స్కానింగ్‌ ద్వారా నిర్ధారించారు. అయితే, మంగళవారం మధ్యాహ్నం వారిద్దరూ వ్యవసాయ పనుల్లో ఉండగా ఉన్నట్టుండి పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆశ కార్యకర్తకు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఏఎన్‌ఎంకు ఆశ కార్యకర్త సమాచారం అందించి.. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థుల సహకారంతో ఆస్పత్రికి తరలించేందుకు డోలీ కట్టించింది. వారిద్దర్నీ డోలీల్లో గ్రామ శివారుకు తీసుకువచ్చేసరికి సుశీల మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు సపర్యలు చేసి పిడతమామిడి వరకు డోలీలో తీసుకువచ్చి అక్కడ నుంచి ఫీడర్‌ అంబులెన్స్‌లో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అలాగే పాంగి చిన్నారిని అటవీ ప్రాంతం గుండా గ్రామానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అడవిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను కూడా పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతానికి మాతా శిశువులు క్షేమంగా ఉన్నారు. కొండ శిఖర గ్రామమైన బోయవూటలో సుమారు 150 మంది ఆదివాసీ గిరిజన తెగకు చెందినవారు జీవిస్తున్నారు. ఈ గ్రామానికి అంతాడ లేదా రొంపుల నుంచి 10 కిలోమీటర్లు, మండల కేంద్రం నుంచి పిడతమామిడి మీదుగా 8 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతం నుంచి నడిచి వెళ్లాలి. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డోలీ మోత తప్పడం లేదని వాపోతున్నారు.

Updated Date - 2023-08-02T04:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising