ఏపీలో కులచిచ్చు రాజకీయాలు
ABN, First Publish Date - 2023-03-16T02:52:38+05:30
కులచిచ్చు రాజకీయాల కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగడం లేదని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
అందుకే రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు
అధికార, ప్రతిపక్షాలు రెండూ బీజేపీ వైపే
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఉమ్మడి ఏపీని విడగొట్టింది కేసీఆర్ కాదు
బీజేపీ సహకరిస్తే కాంగ్రెస్ చేసింది: తోట
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కులచిచ్చు రాజకీయాల కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగడం లేదని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఒక పార్టీ అధికారంలో ఉంటే.. మరో పార్టీకి చెందిన కులం వారిని ఇబ్బంది పెట్టడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ఏపీలో విచిత్ర పరిస్థితులున్నాయని, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ బీజేపీ వైపే ఉన్నాయని, అందుకే మోదీని ప్రశ్నించి రాష్ట్రానికి కావాల్సింది సాధించుకోలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోటచంద్రశేఖర్ సమక్షంలో బుధవారం తెలంగాణ భవన్‌లో కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. 8 ఏళ్లలో కనీసం రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకోలేక పోయారని, సముద్ర తీరాన వైజాగ్ లాంటి నగరం ఉన్నా, దాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీని విడగొట్టింది కేసీఆర్ కాదని, బీజేపీ సహకరిస్తే కాంగ్రెస్ పార్టీనే విడగొట్టిందని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Updated Date - 2023-03-16T02:52:38+05:30 IST