గుంటూరు మేయర్‌పై కేసు నమోదు చేయాలి
ABN, First Publish Date - 2023-09-13T04:31:35+05:30
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కుట్రపూరితంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు మేయర్ మనోహర్‌పై 24గంటల్లోగా కేసు నమోదు
లేదంటే సుప్రీంకోర్టులో పిటిషన్: మనోహర్
గుంటూరు, సెప్టెంబరు 12: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కుట్రపూరితంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు మేయర్ మనోహర్‌పై 24గంటల్లోగా కేసు నమోదు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు. మేయర్ వ్యాఖ్యలను సూమోటోగా తీసుకొని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ కేసు నమోదు చేయకపోతే మేయర్‌తో పాటు జిల్లా ఎస్పీపై కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని ఆయన హెచ్చరించారు.
Updated Date - 2023-09-13T04:31:35+05:30 IST