ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరుగా శిక్ష విధించడానికి వీల్లేదు!

ABN, First Publish Date - 2023-06-07T03:51:31+05:30

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి చార్జ్‌మెమో జారీ చేయకుండా, శాఖాపరమైన విచారణ జరపకుండా నేరు గా శిక్ష విధించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వోద్యోగి కేసులోస్పష్టం చేసిన హైకోర్టు

36 ఏళ్ల తరువాత ఉద్యోగికి విముక్తి

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి చార్జ్‌మెమో జారీ చేయకుండా, శాఖాపరమైన విచారణ జరపకుండా నేరు గా శిక్ష విధించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలా శిక్ష ఖరారు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఓ ఉద్యోగికి 1987లో అధికారు లు విధించిన శిక్షను రద్దు చేసింది. ఈ మేరకు హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రా య్‌, జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. పట్టు పరిశ్రమ శాఖలో సీహెచ్‌. లక్ష్మీనరసయ్య ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. సర్వీసులో ఉండగా పనితీరు సంతృప్తికరంగా లేదని అధికారులు షో కాజ్‌ నోటీసు ఇచ్చారు.

నరసయ్య ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని అతనికి ఎలాంటి చార్జ్‌ మె మో ఇవ్వకుండా, శాఖాపరమైన విచారణ జరపకుండా రెండు ఇంక్రిమెంట్లను నిలిపివేస్తూ 1987 లో శిక్ష ఖరారు చేశారు. ఈ శిక్షను సవాల్‌ చేస్తూ లక్ష్మీనరసయ్య అప్పీల్‌ వేయగా అధికారులు కొట్టివేశారు. దీంతో పిటిషనర్‌ 1989లో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా 2005 వరకు అది పెండింగ్‌లోనే ఉంది. తర్వాత దానిని కొట్టివేశారు. దీంతో అదే ఏడాది పిటిషనర్‌ ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. అయితే 1987లో విధించిన శిక్షను 2005లో సవాల్‌ చేయడాన్ని ట్రైబ్యునల్‌ తప్పు పట్టింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ 2006లో ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ తిరిగి 2015లో హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అసాధారణ జా ప్యం ఉన్నందున పిటిషన్‌ను కొట్టివేయాలన్న ప్ర భుత్వ వాదనను తోసిపుచ్చింది. లక్ష్మీనరసయ్యకు అన్ని సర్వీసు ప్రయోజనాలు కల్పించాలని అధికారులను ఆదేశిస్తూ వ్యాజ్యంపై విచారణను మూసివేసింది.

Updated Date - 2023-06-07T03:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising