ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శాంతించిన గోదావరి

ABN, First Publish Date - 2023-08-02T03:52:40+05:30

గోదావరి శాంతించింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద రెండు ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.

ధవళేశ్వరంలో హెచ్చరికలు ఉపసంహరణ

రాజమహేంద్రవరం, పోలవరం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గోదావరి శాంతించింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద రెండు ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. బ్యారేజి వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు నీటిమట్టం 10.9 అడుగులుగా ఉంది. సముద్రంలోకి 8 లక్షల 64 వేల 489 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. ఎగువన వర్షాలు తగ్గడంతో భద్రాచలం వద్ద సాయంత్రం 5 గంటలకు నీటిమట్టం 29.1 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న 9,29,921 లక్షల క్యూసెక్కుల అదనపు వరద జలాలను మంగళవారం దిగువకు విడుదల చేసినట్లు ఈఈ పి.వెంకటరమణ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ఎగువన 32.320 మీటర్ల నీటిమట్టం, స్పిల్‌వే దిగువన 24.000 మీటర్లు, ఎగువ కాపర్‌ డ్యాం వద్ద 33.070 మీటర్ల నీటిమట్టం, దిగువన 23.500 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 22.577 మీటర్లకు తగ్గింది. కడమ్మ వంతెన, పోలవరం ప్రాజెక్టు పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద నీటి మట్టం తగ్గడంతో పోలవరం ప్రాజెక్టుకి వెళ్లే రోడ్డు మార్గం వంతెన వరద నీటి నుంచి బయటపడింది. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-08-02T03:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising