ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేంద్ర మంత్రి చెప్పినా నమ్మరా?: బుగ్గన

ABN, First Publish Date - 2023-08-04T03:18:15+05:30

ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన గణాంకాలను కూడా నమ్మకపోతే ఎలా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన

అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన గణాంకాలను కూడా నమ్మకపోతే ఎలా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో కంటే తక్కువ అప్పులే చేస్తున్నామని తెలిపారు. 2019 మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.4,42,442 కోట్లకు చేరినట్టు నిర్మలా సీతారామన్‌ చెప్పారన్నారు. దీని ప్రకారం తమ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని బుగ్గన చెప్పుకొచ్చారు. టీడీపీ పాలించిన ఐదేళ్లలో రాష్ట్ర జీఎ్‌సడీపీ సగటున రూ.6 లక్షల కోట్ల పైచిలుకు ఉండగా, తమ హయాంలో జీఎ్‌సడీపీ సగటు రూ.11 లక్షల కోట్లు ఉందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఆదాయం కంటే తమ హయాంలో ఆదాయం పెరిగిందని, ఇదంతా సంపద సృష్టేనని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పుల గురించి మాట్లాడకుండా ఇప్పుడు తమ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారని, రాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పరిమితికి మించి అప్పులు చేశారని, తాము వాటిని తిరిగి కట్టామన్నారు.

Updated Date - 2023-08-04T03:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising