ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలాసలో టీడీపీ నేతపై హత్యాయత్నం

ABN, First Publish Date - 2023-04-03T02:05:48+05:30

రాష్ట్రంలో వైసీపీ నాయకులు మరోమారు బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండల టీడీపీ అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాష్ట్రంలో మరోమారు బరితెగించిన వైసీపీ నాయకులు

ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీ

అనంతరం రాడ్లు, కర్రలతో దాడి

మండలాధ్యక్షుడు లక్ష్మణకుమార్‌కు తీవ్ర గాయాలు

స్థానికుల రాకతో వైసీపీ నేతల పరార్‌

ఆస్పత్రిలో బాధితుడికి గౌతు శిరీష పరామర్శ

బాధ్యులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌

పలాస, ఏప్రిల్‌ 2: రాష్ట్రంలో వైసీపీ నాయకులు మరోమారు బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండల టీడీపీ అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. పలాస జాతీయరహదారిపై రామకృష్ణాపురం గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. బాధితుడు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం లక్ష్మణకుమార్‌ కారుపై వెళ్తుండగా వైసీపీ నాయకుడు నర్తు ప్రేమ్‌కుమార్‌, ఆయన అనుచరులు వెనక నుంచి వాహనంలో వచ్చి ఢీకొన్నారు. అనంతరం లక్ష్మణకుమార్‌పై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. స్థానికులు గుర్తించి పరుగున రావడంతో వైసీపీ నాయకు లు పారిపోయారు. దాడిలో లక్ష్మణకుమార్‌ కుడి కాలు విరిగిపోగా, ఎడమకా లు, చేయి, భుజాలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు పలాస ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని జీజీహెచ్‌కు తరలించారు.

మంత్రి సీదిరి నుంచి ప్రాణహాని?

లక్ష్మణకుమార్‌ ఆదివారం ఉదయం 11.30 గంటలకు రామకృష్ణాపురం వద్ద ఓ భూ వివాదానికి సంబంధించి నిరూపించాలంటూ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు సవాలు విసిరారు. ఆ తర్వాత 4 గంటలకే ఆయనపై దాడి జరగడం గమనార్హం. మంత్రి ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని, ఆయన తనపై కక్షగట్టారని లక్ష్మణకుమార్‌ ఆరోపించారు. మంత్రి నుంచి తన కు ప్రాణహాని ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మా జీమంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి ఆస్పత్రిలో లక్ష్మణకుమార్‌ను పరామర్శించారు. బాధ్యులను తక్షణం అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2023-04-03T02:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising