ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో ఒక్కొక్కరి నెత్తిన రూ.1.80లక్షల అప్పు!

ABN, First Publish Date - 2023-06-26T03:59:57+05:30

ఏపీలో ఒక్కొక్కరి నెత్తిన రూ.1.80లక్షల అప్పు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

కడప (మారుతీనగర్‌), జూన్‌ 25 : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆరోపించారు. జగన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఐదున్నర కోట్ల జనాభాలో ఒక్కొక్కరి నెత్తిపై రూ1.80 లక్షల అప్పు పెట్టారని చెప్పారు. ఆదివారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకుల ఆగడాలు తారస్థాయికి చేరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర అణగారిన వర్గాలకు రక్షణ లేకుండాపోయిందని ఆరోపించారు. సాక్షాత్తు వైసీపీకి చెందిన ఓ ఎంపీ రాష్ట్రంలో వ్యాపారం చేయలేక పక్క రాష్ట్రమైన తెలంగాణకు వెళుతున్నట్లు చెప్పడం వైసీపీకి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు జగన్‌రెడ్డి కనీసం సొంత జిల్లాలో ఒక్క రహదారిని కూడా నిర్మించిన దాఖలాలు లేవన్నారు. ఇటీవల అనంతపురంలో దివ్యాంగులకు ఇచ్చిన 10 సెంట్ల స్థలం సైతం వైసీపీ నాయకులు కబ్జా చేశారని, ఇదేమని అడిగిన దివ్యాంగులపై కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి పథకంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కో కూలీకి రూ.272 అందిస్తుండగా అందులో నుంచి రూ.150 మాత్రమే ఇస్తూ మిగతాది కమీషన్ల పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-26T03:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising