అమర్నాథ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గౌతు శిరీష
ABN, First Publish Date - 2023-06-26T03:57:56+05:30
అమర్నాథ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గౌతు శిరీష
బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న మనవరాలు, పలాస టీడీపీ నాయకురాలు గౌతు శిరీష ఆరోపించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండల కార్యాలయం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. అమర్నాథ్ గౌడ్ ప్రాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు విలువ కట్టిందని, బీసీలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చులకనో ఇదే నిదర్శనమని చెప్పారు. నిందితులకు త్వరితగతిన శిక్ష విధించాలని కోరారు.
Updated Date - 2023-06-26T03:57:56+05:30 IST