‘గడప గడపకు’ తాళాలే..
ABN, First Publish Date - 2023-06-26T03:13:50+05:30
‘గడప గడపకు’ తాళాలే..
ప్రభుత్వ విప్ ‘కాపు’నకు పరాభవం
బొమ్మనహాళ్, జూన్ 25: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఘోర పరాభవం ఎదురైంది. బొమ్మనహాళ్ మండలం గౌనూరు గ్రామాన్ని ఆదివారం ఉదయాన్నే కాపు సందర్శించారు. ఆయన వస్తున్నారని తెలుసుకున్న అధికశాతం మంది గ్రామస్థులు ఉదయాన్నే ఇళ్లకు తాళాలు వేసుకుని, వెళ్లిపోయారు. పథకాల గురించి కరపత్రాలు అందించి ఫొటోలు దిగేందుకు ప్రయత్నించగా తాళాలు వేసిన ఇళ్లే దర్శనమిచ్చాయి. అరగంటపాటు గ్రామంలో పర్యటించినా ఆశించిన స్పందన లభించలేదు. దీంతో తాళాలు వేసిన ఇళ్ల వద్దనే గ్రామంలో ఉన్న కొద్దిమందితో కాపు పొటోలు దిగి, కార్యక్రమాన్ని మమ అనిపించారు. హాజరైన అధికారులు, వలంటీర్లపై విప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-06-26T03:13:50+05:30 IST