సీఎం వస్తున్నారని.. బడులకు సెలవు!
ABN, First Publish Date - 2023-06-26T03:00:32+05:30
అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం రానున్నారు.
మన్యం జిల్లా కురుపాంలో ఎల్లుండి జగన్ పర్యటన
పార్వతీపురం(ఆంధ్రజ్యోతి)/కురుపాం, జూన్ 25: అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం రానున్నారు. రక్షణ చర్యల నేపథ్యంలో కల్టెకర్ నిశాంత్‌కుమార్ ఆదేశాల మేరకు కురుపాంలో విద్యాసంస్థలకు ఏకంగా 3రోజుల పాటు సెలవు ప్రకటించారు. బహిరంగ సభ, హెలీప్యాడ్‌ఏర్పాట్లు, ఉన్నతాధికారులు, పోలీసులు, ఇతర భద్రతా సిబ్బందికి వసతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Updated Date - 2023-06-26T03:00:32+05:30 IST