ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపత్తులను ముందే ఎదుర్కోండి

ABN, First Publish Date - 2023-06-01T05:16:29+05:30

రానున్న నైరుతి సీజన్‌లో సంభవించే తుఫాన్లు, వరదల వంటి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికలతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముందస్తు ఏర్పాట్లు చేసుకోండి

నైరుతి రుతుపవనాల సన్నద్ధతపై అధికారులకు సీఎస్‌ ఆదేశాలు

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రానున్న నైరుతి సీజన్‌లో సంభవించే తుఫాన్లు, వరదల వంటి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికలతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. నైరుతి సన్నద్ధతపై బుధవారం సచివాలయంలో సంబంధిత శాఖలు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఆయన సమీక్షించారు. సీఎస్‌ మాట్లాడుతూ వాతావరణ శాఖ అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్‌ 4న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, జూన్‌ 8 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించి, 12నాటికి రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. తుఫాన్లు, వరదలను ఎదుర్కొనేందుకు సముద్ర తీరప్రాంత మండలాలు, నదీ పరివాహక ప్రాంత మండలాల్లో ప్రత్యేక ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికతో సిద్ధం కావాలన్నారు. విపత్తులు సంభవిస్తే.. ఆస్తి, ప్రాణ నష్టాలు కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు అవసరమైన పరికరాలు, ఇతర సామగ్రి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గతేడాది తిరుపతిలో అండర్‌పాస్‌ల వద్ద నీరు నిలిచి ప్రాణనష్టం జరిగిందని.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్లు, వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Updated Date - 2023-06-01T05:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising